భోగ శ్రీనివాస మూర్తి
తిరుమల ఆలయానికి రెండువేల సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది. తిరుమల ఆలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కొన్ని రహస్య విషయాలైతే అర్చక స్వాములకు తప్ప ఇతరులకు తెలియదు.
తిరుమల ఆలయం పంచబేర ఆలయం. అంటే వేంకటేశ్వర
స్వామి ఐదు రూపల్లో పూజలు అందుకుంటాడు.
స్వామివారి మూల విరాట్టు స్వయంవ్యక్తం. అంటే
స్వామివారు తనకు తాను ప్రత్యక్షం అయ్యారు. మరి మిగిలిన నాలుగు విగ్రహాల విషయం ..
తిరుమల ఆలయంలో కౌతుక మూర్తిగా నిత్య
అభిషేకాలు చేయించుకుంటున్న భోగ శ్రీనివాస మూర్తి గురించి మాత్రం ఖచ్చితమైన
చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
క్రీ. శ. 966 లో పల్లవ రాజ వంశానికి చెందిన సమవై పేరిందేవి అనే
రాణి ఈ భొగ శ్రీనివాస మూర్తిని ఆలయానికి సమర్పించింది.
ఈ విగ్రహం వెండితో తయారు చేయబడింది. ఒక్క
అడుగు ఎత్తు ఉంటుంది. అచ్చం స్వామివారిని పోలి ఉంటుంది. ఈయన్ను ఆ రోజుల్లో మనవాళ
పెరుమాల్ అనేవారు.
నిత్య పెళ్ళికొడుకుగా ప్రతిరోజూ ఏకాంత
పవళింపు సేవ చేయించుకునే స్వామివారు ఈ భోగ శ్రీనివాసమూర్తే.
Comments
Post a Comment