Posts

భోగ శ్రీనివాస మూర్తి

Image
  తిరుమల ఆలయానికి రెండువేల సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది. తిరుమల ఆలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కొన్ని రహస్య విషయాలైతే అర్చక స్వాములకు తప్ప ఇతరులకు తెలియదు. తిరుమల ఆలయం పంచబేర ఆలయం. అంటే వేంకటేశ్వర స్వామి ఐదు రూపల్లో పూజలు అందుకుంటాడు. స్వామివారి మూల విరాట్టు స్వయంవ్యక్తం. అంటే స్వామివారు తనకు తాను ప్రత్యక్షం అయ్యారు. మరి మిగిలిన నాలుగు విగ్రహాల విషయం .. తిరుమల ఆలయంలో కౌతుక మూర్తిగా నిత్య అభిషేకాలు చేయించుకుంటున్న భోగ శ్రీనివాస మూర్తి గురించి మాత్రం ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీ. శ. 966 లో పల్లవ రాజ వంశానికి చెందిన సమవై పేరిందేవి అనే రాణి ఈ భొగ శ్రీనివాస మూర్తిని ఆలయానికి సమర్పించింది. ఈ విగ్రహం వెండితో తయారు చేయబడింది. ఒక్క అడుగు ఎత్తు ఉంటుంది. అచ్చం స్వామివారిని పోలి ఉంటుంది. ఈయన్ను ఆ రోజుల్లో మనవాళ పెరుమాల్ అనేవారు. నిత్య పెళ్ళికొడుకుగా ప్రతిరోజూ ఏకాంత పవళింపు సేవ చేయించుకునే స్వామివారు ఈ భోగ శ్రీనివాసమూర్తే.  

తిరుపతి శ్రీ కోదండ రామాలయం ప్రాచీన చరిత్ర

Image
 తిరుపతిలో ఉన్న ప్రముఖ ఆలయాలలో మూడవది శ్రీ కోదండ రామాలయం. మొదటిది గోవిందరాజాలయం. రెండవది కపిల తీర్థం.  ఈ ఆలయాన్ని మొదట్లో పెరియ రఘునాథాలయం అనేవారు. ఈ స్వామికి పెద్ద రఘునాథుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే గోవింద రాజుల ఆలయంలో మరో రఘునాథుడు ఉన్నాడు.  ఈ ఆలయాన్ని 1480 లో విజయనగర రాజు సాలువ నరసిం హ దేవ రాయలు నిర్మించాడు. ఈయన శ్రీ క్రిష్ణ దేవరాయలుకు ముందు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజు. శాసనాల్లో ఈయన పేరు నరసిం హ మొదలియార్ అని ఉంది. అది ఎందువల్లనో తెలియదు.  నిజానికి ఈ ఆలయం మొదట్లో కపిల తీర్థం దగ్గర ఉండేది, అది ముస్లిం దండయాత్రల వలన ధ్వంసం అయితే ఇక్కడ పునర్మించారు అనే అభిప్రాయం కూడా ఉంది. విగ్రహాలు రామచంద్ర గుంటలో దొరికితే జనమేజయుడు ఇక్కడ ప్రతిష్టించాడు అని స్థల పురాణం చెపుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.    ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎదురుగా అంజనేయ స్వామి గుడి ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే రాముల వారికి కుడిచేతి వైపున సీతామాత ఉంటుంది. ఇలా సీతారాములు ఉండడం చాలా అరుదైన విషయం.  కొండమీదున్న శ్రీవారి ఆలయంలో ఉన్న రాముల వారి మేడలో కూ...

తిరుపతిలో తప్పక చూడవలసిన ఆలయాలు - 1

తిరుపతి నడిబొడ్డున రైల్వే స్టేషన్ ఎదురుగా గోవిందరాజ స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం నిర్మాణం తోనే తిరుపతి నగరం పుట్టుక ప్రారంభం అయింది. దాదాపు వెయ్యి సంవత్సరాలకు ముందు రామానుజుడు ఈ ఆలయాన్ని నిర్మించి గోవిందరాజ స్వామిని ప్రతిష్టించాడు. గర్భాలయం లోని గోవిందరాజస్వామి విగ్రహం అనుకోని పరిస్థితులలో అప్పటికప్పుడు సున్నంతో తయారుచేయబడింది. అభిషేకం చేస్తే సున్నం కరిగిపోతుంది కనుక ఈ స్వామికి అభిషేకం ఉండదు. తమిళనాడు చిదంబరంలోని గోవిందరాజస్వామి ఆలయానికి, ఈ ఆలయానికి దగ్గర సంబంధం ఉంది. ఈ స్వామి పక్కనే శ్రీ కృష్ణుడు పార్థసారథి స్వామి అవతారంలో కొలువై ఉంటాదు. నిజానికి ఈ ఆలయం ఈయనదే. అప్పటికే కొలువై ఉన్న పార్థసారథి స్వామి ఆలయంలో గోవిందరాజ స్వామిని ప్రతిష్టించాడు రామానుజాచార్యుడు. ఇందుకు నిదర్శనంగా పార్థసారథిస్వామికి ఎదురుగానే ధ్వజస్థంభం, బలిపీఠం ఉండదం ఈనాటికీ మనం చూడొచ్చు. ఈ గోవిందరాజ స్వామి ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా అద్భుతమైన కళాసంపదతో కొలువై ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో అనేకమైన ఉపాలయాలు, మఠాలు ఉన్నాయి. చిన రఘునాథుడు అనే పేరుతో వెలసిన శ్రీరాముడు ఉన్నాడు. ఈ ఆలయానికి ముందున్న మట్లి రాజుల చేత నిర్మాణం కాబడిన రాజగ...