Posts

Showing posts from April, 2022

తిరుపతి శ్రీ కోదండ రామాలయం ప్రాచీన చరిత్ర

Image
 తిరుపతిలో ఉన్న ప్రముఖ ఆలయాలలో మూడవది శ్రీ కోదండ రామాలయం. మొదటిది గోవిందరాజాలయం. రెండవది కపిల తీర్థం.  ఈ ఆలయాన్ని మొదట్లో పెరియ రఘునాథాలయం అనేవారు. ఈ స్వామికి పెద్ద రఘునాథుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే గోవింద రాజుల ఆలయంలో మరో రఘునాథుడు ఉన్నాడు.  ఈ ఆలయాన్ని 1480 లో విజయనగర రాజు సాలువ నరసిం హ దేవ రాయలు నిర్మించాడు. ఈయన శ్రీ క్రిష్ణ దేవరాయలుకు ముందు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజు. శాసనాల్లో ఈయన పేరు నరసిం హ మొదలియార్ అని ఉంది. అది ఎందువల్లనో తెలియదు.  నిజానికి ఈ ఆలయం మొదట్లో కపిల తీర్థం దగ్గర ఉండేది, అది ముస్లిం దండయాత్రల వలన ధ్వంసం అయితే ఇక్కడ పునర్మించారు అనే అభిప్రాయం కూడా ఉంది. విగ్రహాలు రామచంద్ర గుంటలో దొరికితే జనమేజయుడు ఇక్కడ ప్రతిష్టించాడు అని స్థల పురాణం చెపుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.    ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎదురుగా అంజనేయ స్వామి గుడి ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే రాముల వారికి కుడిచేతి వైపున సీతామాత ఉంటుంది. ఇలా సీతారాములు ఉండడం చాలా అరుదైన విషయం.  కొండమీదున్న శ్రీవారి ఆలయంలో ఉన్న రాముల వారి మేడలో కూ...

తిరుపతిలో తప్పక చూడవలసిన ఆలయాలు - 1

తిరుపతి నడిబొడ్డున రైల్వే స్టేషన్ ఎదురుగా గోవిందరాజ స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం నిర్మాణం తోనే తిరుపతి నగరం పుట్టుక ప్రారంభం అయింది. దాదాపు వెయ్యి సంవత్సరాలకు ముందు రామానుజుడు ఈ ఆలయాన్ని నిర్మించి గోవిందరాజ స్వామిని ప్రతిష్టించాడు. గర్భాలయం లోని గోవిందరాజస్వామి విగ్రహం అనుకోని పరిస్థితులలో అప్పటికప్పుడు సున్నంతో తయారుచేయబడింది. అభిషేకం చేస్తే సున్నం కరిగిపోతుంది కనుక ఈ స్వామికి అభిషేకం ఉండదు. తమిళనాడు చిదంబరంలోని గోవిందరాజస్వామి ఆలయానికి, ఈ ఆలయానికి దగ్గర సంబంధం ఉంది. ఈ స్వామి పక్కనే శ్రీ కృష్ణుడు పార్థసారథి స్వామి అవతారంలో కొలువై ఉంటాదు. నిజానికి ఈ ఆలయం ఈయనదే. అప్పటికే కొలువై ఉన్న పార్థసారథి స్వామి ఆలయంలో గోవిందరాజ స్వామిని ప్రతిష్టించాడు రామానుజాచార్యుడు. ఇందుకు నిదర్శనంగా పార్థసారథిస్వామికి ఎదురుగానే ధ్వజస్థంభం, బలిపీఠం ఉండదం ఈనాటికీ మనం చూడొచ్చు. ఈ గోవిందరాజ స్వామి ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా అద్భుతమైన కళాసంపదతో కొలువై ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో అనేకమైన ఉపాలయాలు, మఠాలు ఉన్నాయి. చిన రఘునాథుడు అనే పేరుతో వెలసిన శ్రీరాముడు ఉన్నాడు. ఈ ఆలయానికి ముందున్న మట్లి రాజుల చేత నిర్మాణం కాబడిన రాజగ...